logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పేద కుటుంబాల ఇంటికి వెళ్లి CMRF చెక్కులు అందించిన పొందూరు మాజీ ఎంపీపి కూన ప్రమీల

AIMA న్యూస్ శ్రీకాకుళం :
నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు* *సీఎంఆర్ఎఫ్ కొండంత* *భరోసా ---ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు*

*పలు పేద కుటుంబాలకు ఇంటి వద్దకు వెళ్లి CMRF చెక్కులు* *అందించిన పొందూరు మాజీ* *ఎంపీపీ కూన ప్రమీల గారు*

అమదాలవలస నియోజకవర్గoలో బూర్జ మండలంలోని ఈ మధ్య కాలం లో అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలకు వైద్య ఖర్చులు నిమిత్తం చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయంగా వారి కుటుంబాలకి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి వచ్చిన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ చెక్కులను ఆమదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ *కూన రవికుమార్* గారి సతీమణి పొందూరు మండల మాజీ ఎంపీపీ *శ్రీమతి కూన ప్రమీలా* మేడం గారు స్వయంగా లబ్ధిదారులు కుటుంబాల ఇంటి వద్దకు వెళ్లి వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని లబ్దిదారులకి చెక్కులు ఇవ్వడం జరిగినది.

*లబ్ధిదారుల* *వివరాలు*

1. కుమరాపువరం- 77000(పెద్ద లంకం)

2.చల్లారాజేశ్వరరావు- 18300(గుత్తవిల్లి)

3దువ్వరపు ఇందు- 27000(లాభం)

ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు ముఖ్యమంత్రి గారికి మరియు ఎమ్మెల్యే కూన రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకు వలే ఆదుకుంటున్నారని శ్రీమతి కూన ప్రమీలా గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-------
టీడీపీ కార్యాలయం
ఆమదాలవలస

4
202 views

Comment