logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం... ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ విడుదల నిరుద్యోగులకు ఆశా కిరణం

*▪️యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం...*

*▪️ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల – నిరుద్యోగులకు ఆశాకిరణం...*

*▪️స్కిల్ డెవలప్‌మెంట్, పారిశ్రామిక వృద్ధితో విస్తృత ఉద్యోగావకాశాలు...*

*▪️పాతపట్నంలో తెలుగు యువత ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి చిత్రపటానికి పాలాభిషేకం...*

*▪️పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారి ఆదేశానుసారం నియోజకవర్గం తెలుగుయువత అధ్యక్షులు మరియు మండల తెలుగు యువత అధ్యక్షులు మీడియా సమావేశంలో పాల్గొని. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు. రాబోయే 20 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు.ఇప్పటివరకు కేవలం 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలను కల్పించడం జరిగిందని, టీడీపీ పాలనలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంగా ఉన్నామని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్, పారిశ్రామిక వృద్ధి ద్వారా యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ద్వారా ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విద్య, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులు పెంచడం వల్ల యువతకు శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతున్నాయని వివరించారు.గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఐటి, విద్య శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల నియోజకవర్గ యువత ధన్యవాదాలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు అంపిలి పొలినాయుడు, మండల అధ్యక్షులు బుద్ధుల నరేష్, బసవ పరమేశ్వర్ రెడ్డి, వాలిపల్లి వెంకటరమణ, కుంచాల బాలకృష్ణల ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.*

12
395 views

Comment