అర్సెలర్ మిట్టల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం – ఇంటింటి ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు
AIMA news శ్రీకాకుళం :
*▪️పాతపట్నం మండలం తామర గ్రామంలో డోర్ టు డోర్ డ్రైవ్ ద్వారా ప్రజలకు ప్లాంట్ ప్రారంభం పై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు...*
*▪️అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించి పాతపట్నం నియోజకవర్గంలో విస్తృత ప్రచారం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు పాతపట్నం మండలం తామర గ్రామంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.మార్చి 23న జరగనున్న ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలను ఆహ్వానిస్తూ ఇంటింటికీ వెళ్లి వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రత్యేకంగా 42 క్లస్టర్లలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ప్లాంట్ ద్వారా సుమారు 20,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 55,000 నుంచి 60,000 వరకు పరోక్ష ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే పరిశ్రమ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రోడ్లు, విద్యుత్, కాలువలు వంటి మౌలిక వసతులు మెరుగుపడతాయని తెలిపారు.ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సభలు, బైక్ ర్యాలీలు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే “Thank You CM” కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఇంచార్జులు, కార్యకర్తలు, యువత మరియు టీడీపీ అనుబంధ సంఘాలు పాల్గొన్నారు.*