logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీలకు నలుగురు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల అర్హత 💪🌍

హర్యానా రాష్ట్రంలోని సోనిపట్‌ లో 22-03-2026 తేదీన NSPF (నాచురల్ స్ట్రాంగ్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో GPC ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీల సెలక్షన్ ట్రయల్స్ ఘనంగా నిర్వహించబడ్డాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన పవర్ లిఫ్టర్లు ఈ ట్రయల్స్‌లో పాల్గొని తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించారు. 🏋️‍♂️
ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు POWERLIFTERS(ఎం. భాస్కరరావు, ఎం. శ్రీనివాసరావు, పి.వి.ఎం. నాగజ్యోతి, టి. శ్రీనివాసరావు) అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. 👏
వీరు అక్టోబర్ 19 నుండి 25 వరకు పోలాండ్ దేశంలోని పబియనీస్ నగరంలో జరగనున్న ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ విజయంతో రాష్ట్ర క్రీడాభిమానులు, సహచర క్రీడాకారులు మరియు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 🇮🇳✨
ఈ సందర్భంగా క్రీడా రంగ ప్రముఖులు మరియు అధికారులు అర్హత సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ, ప్రపంచ స్థాయిలో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. 🌟🏆🏆🏆🏆🇳🇪🇳🇪🇳🇪🇳🇪

2
405 views

Comment