logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా చలివేంద్రం ప్రారంభించిన డాక్టర్ జి. రవి కృష్ణ.

నంద్యాల (AIMA MEDIA): లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకుని బాలాజీ కాంప్లెక్స్ లో కళారాధన, దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించారు.లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ చలివేంద్రాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ, సోమేశుల నాగరాజు మాట్లాడుతూ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చల్లటి నీటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చలివేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడడం అవసరమన్నారు. అనవసరంగా నీటిని వృధా చేయకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. ప్రాణాధారమైన నీటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ వి రమణయ్య, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షు లు చంద్రమోహన్, సీనియర్ సభ్యులు మేడం చంద్రశేఖర్, రామయ్య, కళారాధన సభ్యుడు శివరామిరెడ్డి, నారాయణరెడ్డి, బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

3
200 views

Comment