అనంతగిరి: రేపు రక్తదాన శిబిరం
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పాడేరు ఆధ్వర్యంలో ఈ నెల 23న అనంతగిరి లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ప్రభాకరరావు ఆదివారం తెలిపారు. ఈ రక్తదాన శిబిరం అనంతగిరి వెలుగు కార్యాలయంలో జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో రక్త నిల్వలను పెంచడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొనాలని ఎంపీడీఓ పిలుపు నిచ్చారు.