తహసిల్దార్ కార్యాలయంలో సొమ్మసిల్లుతున్న-సామాన్యుడు
👉 తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు మాయమవుతున్న వైనం
👉 సర్టిఫికెట్లు టేబుల్ పై పెట్టుకొని సంతకం చేయకుండా ప్రజలతో
చెలగాటం
ఇల్లందు ప్రతినిధి మార్చి 22, ( హైమా మీడియా): ఇల్లందు, పట్టణ మండలంలోని తహసిల్దార్ కార్యాలయానికి పోవాలంటేనే సామాన్యుడు భయపడే పరిస్థితి నెలకొందని పట్టణ, మండల ప్రజలు వాపోతున్నారు. కుల, ఆదాయ, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఏ దరఖాస్తు చేసుకున్న అవి పొందేందుకు చెప్పులు అరిగేలా తిరగాల్సివస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ను కలవాలని అర్జీ పెట్టుకున్న ఒక్క రోజులో కలవచ్చు కానీ, ఇల్లందు తాసిల్దార్ని కలవాలంటే నెలలు గడవాల్సిందే అంటున్నారు. తహసీల్దార్ టేబుల్ పై అనేక సర్టిఫికెట్లు సంతకం చేయనివి పక్కకు పడేసినవి ఉన్నాయని పేర్కొన్నారు. కొందరి సర్టిఫికెట్స్ అధికారులె పక్కకు పడేయడంతో మరల రెండో మారు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందని, వాళ్లు పక్కకు పడేసిన సర్టిఫికెట్ కట్టలో వెతకాల్సి వస్తుందని తెలిపారు. సర్టిఫికెట్ దరఖాస్తు చేసి రాకపోవడంతో విసిగి చెందిన దరఖాస్తుదారుడు ఆర్.ఐ వద్దకు వెళ్లి విడంబరంగా అడగగా పంపించాను అంటూ విసుకుంటు సెక్షన్ లో అడగమనటం, తీరా సెక్షన్లో అడిగితే నా వద్దకు రాలేదంటూ చికాకుగా సమాధానం చెపుతున్నారు డిప్యూటీ తాసిల్దార్ (డి.టి)కి చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. తాసిల్దార్ ను కలుద్దాం అనుకుంటే తాసిల్దార్ ఒంటిగంట ఆయన రాకపోవడం ఒకవేళ వచ్చిన గాని డ్యూటీ చేసేది పక్కకు నెట్టి,ఫోన్లతో బిజీగా ఉంటూ, తాసిల్దార్ హల్ తలుపులు దగ్గరకు వేసి తన పర్సనల్ వ్యక్తులతో మాట్లాడటంతో ఆరోజు పుణ్యకాలం కాస్త ముగుస్తుందని ప్రతి రోజు ఇదే తంతు అంటూ ఆగ్రహిస్తున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల వల్ల జీతాలు అందించకపోవడంతో తాసిల్దార్ కార్యాలయ అధికారులు చేతి వాటాలకు పును కుంటున్నారేమోనని బహిరంగంగా మాట్లాడుకోవడం గమనార్హం. ఇల్లందు తహసిల్దార్ ప్రజలకు చేసే సేవ కంటే ప్రైవేటు వ్యక్తులకు చేసే సేవ ఎక్కువైందని, వాళ్లను కూర్చోబెట్టి మాట్లాడటంలో మక్కువ శ్రద్ధ చూపిస్తు, కార్యాలయానికి వచ్చిన వాళ్లను బయట ఎండలో, చెట్ల కింద ఉండేలా చేస్తున్న తీరును ప్రజలు నిత్యం మీడియాతో పంచుకుంటున్నారు అని పేర్కొన్నారు. ఎరోజు సర్టిఫికెట్లు ఆరోజు సంతకాలు చేయడంలో అభ్యంతరాలు ఎందుకు అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు...? సార్ వ్యవహార శైలితో విసుగు చెందుతున్నామని వాళ్ల బాధని వ్యక్తపరిచారు. ఇల్లందు తహసిల్దార్ కార్యాలయంలో నడుస్తున్న తీరుపై అలాగే అధికారులకు మధ్యవర్తులు గా వ్యవహరించే చేతివాటగల దందాపై జిల్లా అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.