రంజాన్ పండుగ సందర్బంగా ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి.
ఆళ్లగడ్డ (AIMA MEDIA): ఎఫ్.ఎఫ్.ఐ ఆళ్లగడ్డ మండలం కమిటి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్బంగా ఆళ్లగడ్డ ఈద్ గా దగ్గర ముస్లిం సోదరులకు మజ్జిగ పంపిణి కార్యక్రమాన్ని ఎస్.ఎఫ్.ఐ మండల కార్యదర్శి లతీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా మండల కార్యదర్శి లతీఫ్ మాట్లాడుతూ నెల రోజులుగా నుండి ఉపవాస దీక్షలు పాటిస్తూ ఎంతో నియమం, దయ, పేదల పట్ల బాధ్యత గా సమానత్వం, సోదరాభావం నెల రోజులపాటు ఉపవాస దీక్షలులో ఉన్నా ముస్లిం సోదరులకు ఎస్.ఎఫ్.ఐ ఆళ్లగడ్డ మండల కమిటీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ నాయకులు విగ్నేష్, మహేష్, అమీర్, గఫూర్ మరియు తదితరులు పాల్గొన్నారు.