మంత్రి వర్యా….! మా మొర వినుమా…!!
మా బుగ్గారం రోడ్డు వేసి – మమ్ము ఆదుకొనుమా….!!!
- రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాకతో మండల ప్రజల విజ్ఞప్తి
మంత్రి వర్యా….! మా మొర వినుమా…!!
మా బుగ్గారం రోడ్డు వేసి – మమ్ము ఆదుకొనుమా….!!!
- రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాక సందర్భంగా మండల ప్రజల ప్రత్యేక విజ్ఞప్తి
బుగ్గారం / జగిత్యాల జిల్లా:
- ( చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ,
సెల్ నం: 99481 33 539 )
అయ్యా…. మా ప్రియతమ మంత్రివర్యా….! మా మొర వినుమా…!!
మా బుగ్గారం రోడ్డు వేసి – మమ్ము ఆదుకొనుమా …!!! అంటూ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను జగిత్యాల జిల్లా బుగ్గారం మండల ప్రజలు ప్రత్యేకంగా వేడుకుంటున్నారు. పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపనల కోసం ఆదివారం బుగ్గారం మండల కేంద్రానికి విచ్చేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మండల ప్రజలు ఎంతగానో ఆశలు పెట్టుకొని వారి రాక కోసం ఎదిరి చూస్తున్నారు. జగిత్యాల నుండి ధర్మపురి వెళ్ళే 63వ జాతీయ రహదారిలోని “బుగ్గారం ఎక్స్ రోడ్డు” నుండి మండల కేంద్రానికి వచ్చే ప్రధాన రోడ్డు మార్గం సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం మొత్తం రోడ్డు పూర్తిగా చెడిపోయినది. రోడ్డంతా…. గుంతలు – గుంతలతో పాటు కంకర రాళ్లు కూడా తేలి అత్యంత ప్రమాద కరంగా మారింది. నిత్యం ఈ రోడ్డు వెంట వేలాది మంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళంతా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొన్ని ఏండ్ల నుండి రాకపోకలకు తీవ్ర ఇబ్బందితో పాటు, కొత్త – కొత్త వాహనాలు చెడిపోవడం, ఈ రోడ్డు పై ప్రయాణం చేసిన వారు అంతా గుంతల రోడ్డు, కంకర తేలిన రోడ్డుతో శరీరం కుదింపులకు గురై , తీవ్ర అనారోగ్యాల పాలు కావడం జరుగుతోంది. చిన్నా – చితకా ప్రమాదాలు కూడా జరిగి అనేక మంది గాయాల పాలైన వారు కూడా ఉన్నారు. బుగ్గారం మండల కేంద్రం అయినందున నిత్యం అధిక సంఖ్యలో ప్రజలు ఈ రోడ్డు వెంటే ప్రయాణం చేస్తూ ఉంటారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు – సిబ్బంది, ఉద్యోగులు, ఉపాధ్యాయనీ – ఉపాధ్యాయులు, వివిధ రకాల వ్యాపారస్తులు ఈ రోడ్డు వెంట రావాలంటే వారి ప్రాణాలు అర చేతిలో పెట్టుకున్నంత ఇబ్బందిగా మారింది ఈ రోడ్డు దుస్థితి.
కావున అయ్యా… మా ప్రియతమ మంత్రి వర్యా….! దయచేసి మమ్మల్ని కరుణించి మాపై మీ కృపా కటాక్షాలు ఉంచి మా “బుగ్గారం రోడ్డు” డబల్ రోడ్డుగా మంజూరు చేయించి వెంటనే నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం కూడా చేయించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని బుగ్గారం మండల ప్రజలు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను వేడుకుంటున్నారు.
అలాగే…. మేమంతా ఇంకా అనేక సమస్యలతో నిత్యం సతమతం అవుతున్నాం… సౌకర్యాల లేమితో… నిలిచి పోయిన అభివృద్ధి పనులతో…. ప్రభుత్వ కార్యాలయాలలో అధికారుల, సిబ్బంది కొరతతో… ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం…. ప్రత్యేకంగా మిమ్మల్ని కలిసి మా బాధలు, మా సమస్యలు అత్యవసరంగా … మీతో చెప్పుకోవాల్సినవి ఇంకా అనేకంగా ఉన్నాయి.
దయచేసి మిమ్మల్ని వీలైనంత త్వరలో…. మేము ప్రత్యేకంగా కలిసే భాగ్యం మాకు కల్పిస్తారని మండల ప్రజలు, ప్రముఖులు, ముఖ్యంగా మహిళలు, యువత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.