బుగ్గారంలో ప్రోటోకాల్ వివాదం
- అఖిల పక్షం ఆధ్వర్యంలో...
డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం
బుగ్గారంలో ప్రోటోకాల్ వివాదం
- అఖిల పక్షం ఆధ్వర్యంలో...
డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం
తెలంగాణలోని జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, ఎలాంటి ప్రోటోకాల్ పాటించ కుండా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తూ, పత్రికా ప్రకటనలు కూడా చేస్తున్నారని వీరందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల కేంద్రంలోని బస్టాండ్ లో గల డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి అఖిల పక్షం ఆధ్వర్యంలో శనివారం వినతి పత్రం అందజేశారు.
అధికార పార్టీ నేతలు శుక్రవారం మండల కేంద్రంలో రంజాన్ పండుగ తోఫాలను సాక్షాత్తు మండల తహసీల్దార్, ఎంపిడివో లతో పాటు బుగ్గారం గ్రామ సర్పంచ్ నేతృత్వములో పంపిణీ చేశారు. కానీ అధికార పార్టీ నేతలు ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా, మండల తహసీల్దార్ కు, మహిళా ఎంపిడివో కు, దళిత మహిళా సర్పంచ్ కు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ల స్వయం పేర్లతో ప్రకటనలు చేసుకోవడం చట్ట విరుద్ధం, ప్రోటోకాల్ కు విరుద్ధం, భారత రాజ్యాంగాన్ని విస్మరించడం అవుతుందని అఖిల పక్షం ఆధ్వర్యంలో వారు ఆరోపించారు. గత రెండున్నర ఏళ్లుగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాగే కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల వద్ద, ఇతర అభివృద్ధి పనుల వద్ద అధికారికంగా ఎలాంటి పదవులు లేకున్నా, ప్రజా ప్రతినిధులు కాకున్నా, కొబ్బరి కాయలు కొడుతూ ఫోటోలకు పోజులు ఇచ్చి ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తున్నారని, అధికారులందరినీ శాసిస్తున్నారని, ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని వారు వివరించారు. ఒక దళిత మహిళా సర్పంచ్ కు కూడా అవకాశం ఇవ్వకుండా "అన్నీ మేమే - అధికారం అంతా మాదే" అన్న చందంగా అధికార పార్టీ నేతలు చట్టాలను ఉల్లంఘించి, తీవ్ర స్థాయి బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని వారు వివరించారు.
అధికారులు, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి శుక్రవారం అధికారుల సాక్షిగా, దళిత మహిళా సర్పంచ్ సాక్షిగా గాడి తప్పిన ప్రోటోకాల్ వివాదం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలో మరెక్కడా కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో
భారత రాష్ట్ర సమితి మండల పార్టీ అధ్యక్షులు గాలిపెల్లి మహేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చీర్నేని మల్లేశం, బీజేపీ మండల పార్టీ ఉపాధ్యక్షులు కప్పల నరేష్, బిజెపి ఐటీ సెల్ జిల్లా ఇంచార్జ్ సుంకం ప్రశాంత్, భారాస గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నం సత్తన్న, పాదం సత్తన్న, భారాస, బిజెపి నాయకులు దసర్తి చంద్రమోహన్, పొలంపెల్లి మల్లేశం, తుడిసెర్ల శంకర్, మూల శ్రీనివాస్, దొరగాండ్ల జగన్, ఉరిమిట్ల భుచ్చన్న, సిరికొండ మాజీ ఎంపీటీసీ చుక్కారెడ్డి, నక్క గంగారాం, కూతురు పోచమల్లు, కళ్లెం మోహన్, కొమ్మినేని కొమురయ్య, కప్పల మల్లేష్, జంగ రమేష్, కప్పల లచ్చన్న, జక్కుల రాజన్న తదితరులు పాల్గొన్నారు.