మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం
మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం
Mar 21, 2026,
మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం
హైదరాబాద్‌లో మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనవరాలైన దివ్యారెడ్డిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఈ నెల 13న దివ్యారెడ్డి పేరుతో ఉన్న వాట్సప్ ఖాతా నుంచి ఆమె అకౌంటెంట్‌కు మెసేజ్ వచ్చి, రూ.1.20 కోట్లు పంపాలని సూచించింది. అకౌంటెంట్ డబ్బు పంపిన తర్వాత, ఈ నెల 17న మరోసారి డబ్బు పంపాలంటూ మెసేజ్ వచ్చింది. అప్రూవల్ కోసం సంప్రదించగా, దివ్యారెడ్డి తాను ఎవరికీ డబ్బు పంపలేదని స్పష్టం చేశారు. దీంతో బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.