logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తండ్రి, కూతురి జంట హత్యల కేసులో నిందితుని అరెస్టు

తండ్రి, కూతురి జంట హత్యల కేసులో నిందితుని అరెస్టు

కాజీపేట మండలం మాడికొండ పోలిస్ స్టేషన్ పరిధిలో కడిపికొండ గ్రామం రాజీవ్ గృహ కల్పన నందు తండ్రి, కూతురి జంట హత్యల కేసులో కాజీపేట ACP పింగిలి Prashanth రెడ్డి గారు ప్రెస్ మీట్ లో నిందితుని వివరాలు వెల్లడించారు.
యాంకర్ : కడిపికొండ గ్రామం రాజీవ్ గృహకల్పన లో నివాసముంటున్న భాష బోయిన రాజశ్రీ కి మరియు మేడ్చల్ కు చెందిన పొక్కుల ప్రవీణ్ కు 2023 లో వివాహం జరిగింది. వివాహ సమయం లో 3 లక్షల కట్నం,ఇతర సామాగ్రి లాంచనలతో అత్తారింటికి సాగనప్పారు.
అయితే వీరి ఇద్దరికి సవత్సరంన్నర బాబు, ఆరు నెలల పాప ఉన్నారు.
ఈ క్రమంలో భాష బోయిన రాజశ్రీ భర్త పొక్కుల ప్రవీణ్ మరియు ఇద్దరి పిల్లలతో కలిసి తమ పుట్టినిల్లు కడిపికొండ గ్రామం రాజీవ్ గృహకల్ప నకు గత రెండు వారాల క్రితం వచ్చింది. అయితే భార్య భర్తల మధ్య తరచూ గొడవలు రాజశ్రీ తండ్రి భాషబోయిన రాజ శేఖర్ (మామ) అల్లుడు పొక్కుల ప్రవీణ్ ను చంపుతానని బెదిరించారు అదే అదునుగా భావించిన అల్లుడు ప్రవీణ్ దీవి 18 మార్చి 2026 రోజున మామ మద్యం సేవించి గాడ నిద్రలోకి జారుకోగానే అల్లుడు మామ తలపై సుత్తె తో కొట్టి గాయపరిచారు బలమైన గాయం తగలడంతో అతను అపస్మారక స్థితిలో కి వెళ్ళాడు అంతలో నిద్రలేచిన తన భార్య రాజశ్రీ తండ్రి దగ్గరకు వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు ఏమిటి ఇది అని తన భర్త ( నిందితుడు ప్రవీణ్) ను నిలదీయగా అదే సుత్తితో రాజశ్రీ తలపై కూడా మోపి ఇద్దరిని హత్య చేశాడు. అనంతరం నిందితుడు ప్రవీణ్ ముందుగా తెచ్చుకొని పెట్టుకున్న డిజిల్ ఇరువురిపై పోసి నిప్పంటించాడు అనంతరం నిందితుడు 100 కు, మరియు 108 కాల్ చేసి సమాచారం అందించాడు. హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్న మడికొండ ఇనస్పెక్టర్ పుల్యాల కిషన్ మరియు అతని సిబ్బంది హత్యలు జరిగిన పరిసర ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ రక్తం మరుకలు ఉండడం తో పోలీసులు నిందితుడు ప్రవీణ్ (అల్లుడు) ను విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అంతలోనే నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.
శనివారం రోజు సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా నిందితుడు ప్రవీణ్ వారిని చూసి తప్పించుకోబోయాడు
అంతలోనే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడు ప్రవీణ్ ను వెంబడించి పట్టుక్కున్నారు అనంతరం విచారించగా నిందితుడు ప్రవీణ్ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు అని పింగిలి ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటన లో వివరించారు
అనంతరం ACP Prashanth రెడ్డి కేసును సేదించిన పోలీస్ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్, సబ్ ఇన్స్పెక్టర్ లు రాజబాబు, రామ్మోహన్, మరియు పోలీస్ సిబ్బందిని అభినందించారు.

0
82 views

Comment