logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎ ఎస్ పి ఆర్ సుస్మిత IPS విలేకరుల సమావేశం


చింతలపూడి మండలం చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం లో ఎ ఎస్ పి ఆర్ సుస్మిత IPS విలేకరుల సమావేశం

పాల్గొన్న సీఐ క్రాంతికుమార్, చింతలపూడి ఎస్ఐ సతీష్ కుమార్,ధర్మాజీగూడెం ఎస్ ఐ వెంకన్న

IPS ఆర్ సుస్మిత పీసీ కామెంట్స్...
చింతలపూడి సర్కిల్ పరిధిలో ఫిబ్రవరి 27,మరియు మార్చ్ 3 వ తారీకు రెండు దొంగతనాలు జరిగాయి

గణిజర్ల విలేజ్ లో బుల్లా భూలక్ష్మి ఇంట్లో మధ్యాహ్నo ఎవరు లేని సమయం లో దొంగతనం జరిగింది

మెయిన్ డోర్ లాక్ మరియు బీరువా తాళాలు పగలు కొట్టి గోల్డ్ దొంగతనం చేశారు

Sp ప్రతాప్ శివ కిషోర్ IPS ఆదేశాలతో ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేశాము

ఈ టీం ఒక అనుమానస్పద వ్యక్తిని పట్టుకోవడం జరిగింది

అతని ఫింగర్ ప్రింట్స్ కొన్ని నేరాలు జరిగిన ప్లేస్ లో తీసుకున్న ఫింగర్ ప్రింట్స్ కి మ్యాచ్ అవ్వడం జరిగింది

2024 లో పాతిమపురం లో జరిగిన గోల్డ్ దొంగతనం కేసులో ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవ్వడం తో ఈ వ్యక్తితో పాటు ముగ్గిరిని అరెస్ట్ చేశాము

గణిజర్ల, పాతిమపురం లో దొంగతనం జరిగిన గోల్డ్ రికవరీ చేసి ముగ్గురు ముద్దాయిలు దుక్కిపాటి కిషోర్, కొట్టే రమేష్,మూర్ల చార్లెస్ ను రిమాండ్ చేసి కోర్ట్ కి తరలించాము

ఈ ముగ్గురు ముద్దాయిలు చింతలపూడి పరిసర ప్రాంత వాసులు

ధర్మాజీగూడెం స్టేషన్ పరిధిలో జరిగిన గోల్డ్ దొంగతనం కేసులో క్లూస్ టీం ఆధారంగా బోడ ప్రతీప్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి 38 గ్రాములు గోల్డ్,ఒక డ్యూక్ బైక్ రికవరీ చేశాము

ధర్మంజీగూడెం పోలీసులు ముద్దాయిని రిమాండ్ చేసి కోర్ట్ కి తరలించారు

ఇంటికి తాళం వేసి పనులకు వెళ్లే వారి ఇళ్ళు టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నారు

చింతలపూడి సర్కిల్ పరిధిలో గోల్డ్ దొంగతనాలు కేసులో ముద్దాయిలను పట్టుకున్న సీఐ క్రాంతికుమార్, ఎస్ ఐ లు,సతీష్ కుమార్, వెంకన్న, పి సి లు,సీతా దేవయ్య, వెంకటేశ్వరావు, సత్యనారాయణలకు జిల్లా పోలీస్ కేంద్రం నుండి ప్రశంస పత్రాలు ఇవ్వడం జరుగుతుంది.

1
66 views

Comment