సామాన్యుడికి అందుబాటులో నర్సీపట్నంలో నూతన దంత వైద్యశాల
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం నర్సీపట్నం చుట్టుపక్కల గ్రామీణ ప్రజలకు అత్యంత తక్కువ ఖర్చులతో కూడిన నాణ్యమైన దంత వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. గత 15 ఏళ్లుగా దంత వైద్య రంగంలో పేరుగాంచిన డాక్టర్ ఎస్. చంద్రశేఖర్ రావు (బీడీఎస్, డిప్లమో ఆర్థోడెంటిక్స్, డిప్లమో ఇమ్ప్లాంటాలజీ, కొమెటిక్ డెంటల్ సర్జన్) నేతృత్వంలో నర్సీపట్నం పట్టణంలోని డాన్ బోస్కో పాఠశాలకు వెళ్లే దారిలో కొత్త దంత వైద్యశాల నూతనంగా ప్రారంభం అయింది.పంటి నొప్పి, పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల సమస్యలు, దంతాల అమరిక లాంటి అనేక రకాల దంత సమస్యలకు ఇక్కడ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన చికిత్సల్లో దంతాల క్లీనింగ్, పాచి–రాళ్ల తొలగింపు, ఫిల్లింగ్స్, రూట్ కెనాల్ చికిత్స, దంతాల తీసివేత, బ్రేసెస్/ఆర్థోడాంటిక్స్ ద్వారా వంకర దంతాల అమరిక, ఊడిపోయిన పళ్ల స్థానంలో కృత్రిమ పళ్లు లేదా శాశ్వత ఇంప్లాంట్లు అమర్చుతున్నారు. చిగుళ్లలో వాపు, రక్తం కారడం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ లేదా డీప్ క్లీనింగ్ వంటి చికిత్సలునూ ఇక్కడ అందిస్తున్నారు.అత్యాధునిక లేజర్ డెంటల్ చికిత్సతో నొప్పి లేకుండా, తక్కువ రక్తస్రావంతో చిగుళ్ల సమస్యలు, ఇతర దంత సమస్యలకు చికిత్స చేస్తున్నామని డాక్టర్ చంద్రశేఖర్ రావు తెలిపారు. సామాన్యుడికి వైద్యం భారం కాకూడదనే లక్ష్యంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చికిత్సల రేట్లను చాలా తక్కువగా ఉంచామని, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఖర్చు భారం కాకుండా చూస్తున్నామని శనివారం నిర్వహించిన పత్రికా సమావేశంలో వివరించారు. ప్రతి ఒక్కరూ భయపడకుండా వచ్చి తమ దంత సమస్యలకు సకాలంలో చికిత్స చేయించుకోవాలని, ఇక నుంచి రోగుల సేవకే తమ ఆసుపత్రి 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.