రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం జిల్లా
పత్రికా ప్రకటన
మార్చి 21, 2026 – ఆదిలాబాద్
మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ కలీంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్న అధికారి నివాసానికి వెళ్లిన కలెక్టర్, ఆయన కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అబ్దుల్ కలీం కలెక్టర్‌కు ఘనస్వాగతం పలికారు. రంజాన్ పర్వదిన ప్రత్యేకతలను వివరించగా, కలెక్టర్ ఆసక్తిగా తెలుసుకున్నారు. అనంతరం ముస్లిం సోదరుల పవిత్ర పండుగ ప్రాముఖ్యత, జిల్లాలో కొనసాగుతున్న సామరస్య వాతావరణంపై పరస్పరం చర్చించారు.
పండుగ వేళ కలెక్టర్ స్వయంగా నివాసానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలపడం పట్ల అబ్దుల్ కలీం కృతజ్ఞతలు తెలిపారు.