logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అరకు: మహిళా భద్రత పై అవగాహన ర్యాలీ

కుటుంబ, దేశ అభివృద్ధికి మహిళల భద్రత, విద్య చాలా ముఖ్యమని పాడేరు డీఎస్పీ అభిషేక్ పేర్కొన్నారు. శనివారం అరకులోయ లో ఎస్ఐ గోపాలరావు ఆద్వర్యంలో మహిళల భద్రత పై అవగాహణ ర్యాలీ చేపట్టారు. పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన కూడలి వరకు జరిగిన ఈ ర్యాలీలో స్థానిక మహిళలు, పలు ఆశ్రమ పాఠశాలల విద్యార్ధినిలు పాల్గొన్నారు. కుటుంబాలలో ఆడపిల్లలకు విద్యా, పౌష్టికాహారం ఇవ్వడంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మహిళలకు ఎటువంటి సమస్యలు ఉన్నా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

0
289 views

Comment