logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆళ్లగడ్డలో మిన్నంటిన రంజాన్ సంబరాలు. జనసేన కార్యాలయంలో సందడి.

AIMA న్యూస్ నంద్యాల జిల్లా. మతాల కన్నా మానవత్వమే మిన్న అని చాటిచెబుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం రోజున మత సామరస్యానికి వేదికైంది. నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి, రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు మాబు హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ వేడుకలు.ఈ సమావేశంలో ముస్లిం సోదరులతో కలిసి హిందూ, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాల ప్రకారం, కులమతాల మధ్య గోడలు తొలగించి అందరూ ఒకటే అన్న భావనను ఈ వేడుకలు నిరూపించాయని. కుల మతాలకు అతీతంగా ఏ పండగ వచ్చినా అది అందరి పండుగ కావాలని, అందరూ కలిసి మెలిసి ఉండాలని రాజకీయాలు ఎన్నికల వరకే. కానీ అనుబంధాలు ఎప్పటికీ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు డాల్ రత్నమయ్య, కమాల్ భాష, తిమ్మరాజు, సాధక్, సజ్జల నాగేంద్ర, ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు

127
3882 views

Comment