logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భాజపా రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో ఎన్ వి ఆర్ చేరిక

: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో ముత్యాల వెంకటేశ్వరరావు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విశాఖపట్నం బీజేపీ పార్టీ ఆఫీసులో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలిసి ఎం.వి.ఆర్ కు స్వాగతం పలికారు.రావికమతం మండల బీజేపీ అధ్యక్షుడు మరియు మేడివాడ కోఆపరేటివ్ చైర్మన్ గుటాల చిన్న, మండల ప్రధాన కార్యదర్శి మరియు కొమరవోలు ఆవ వైస్ ప్రెసిడెంట్ దంట్ల సత్యనారాయణ సహా పలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎం.వి.ఆర్ పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.గుటాల చిన్న మాట్లాడుతూ, "ఎం వి ఆర్ చేరికతో మా మండలంలో బీజేపీ బలం మరింత పెరుగుతుంది. ఆయన అనుభవం పార్టీకి చాలా ఉపయోగపడుతుందని" అని అన్నారు. దంట్ల సత్యనారాయణ , "రాష్ట్ర, జాతీయ స్థాయిలో బీజేపీ దృష్టి సార్వత్రిక సంక్షేమంపై ఉంది. ఎం వి ఆర్ మనల్ని బలోపేతం చేస్తారు" అంటూ సంతోషం వ్యక్తం చేశారు.విశాఖపట్నం జిల్లా బీజేపీలో ఇలాంటి చేరికలు పెరుగుతున్నాయి. ఆసక్తి చూపినవారిని పార్టీ స్వాగతిస్తోంది. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

0
0 views

Comment