ఉగాది పురస్కారాలు సందర్భంగా వెలంకాయలపాలెం విద్యార్థులకు ఆటల పోటీలు
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం వెలంకాయలపాలెం గ్రామంలో పరాభవనామ సంవత్సరోత్సవాలను పురస్కరించుకుని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆటల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ యూత్ లీడర్ సిరాల సూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు విజయవంతంగా పూర్తి చేశారు.పోటీల్లో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, వివిధ ఆటల్లో పోటీపడ్డారు. గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో జనసేన యువకులు మణికంఠ, బెజవాడ వాసు తదితరులు, వెలంకాయలపాలెం గ్రామ జనసేన కార్యకర్తలు, వీరమహిళలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఉత్సాహంగ మరింత ఆకర్షణీయంగా మార్చిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.