నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు,
భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, కుమారుడు నారా దేవాన్ష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.44 లక్షలను నారా కుటుంబం విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా సీఎం కుటుంబం భక్తులకు అల్పాహారం వడ్డించారు.