logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మాతృభాషలో ప్రావీణ్యమే శిఖరాల దిశ” – అనకాపల్లి జిల్లాలో మాతృభాషోద్యమ సదస్సు, ఉచిత ఐఐటీ–నీట్ ఫౌండేషన్ కోచింగ్

అనకాపల్లి జిల్లా “వేములపూడిలోని మాతృభాషోద్యమ ఉన్నత పాఠశాలలో “మాతృభాషలో ప్రావీణ్యంతోనే ఉన్నత శిఖరాలు” అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ డీజీపీ, ఐపీఎస్ అధికారి కిల్లాడి సత్యనారాయణ తెలుగు మాతృభాషలో ప్రావీణ్యం, పట్టుదలతో ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత పోస్టులను సాధించవచ్చని విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. తెలుగులోనే నైపుణ్యం సాధించి, అకుంఠిత దీక్షతో లక్ష్యసాధన చేస్తే గొప్ప విజయాలు సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు. ఒకటో తరగతి నుంచి ఎమ్ఎ వరకు తెలుగు మీడియంలో చదివి, తెలుగులోనే ఐపీఎస్ పరీక్ష రాసి ఉత్తరప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్‌గా పనిచేసిన అనుభవాన్ని ఆయన తన సొంత జీవితం ద్వారా తెలియజేశారు.సత్యనారాయణతో పాటు తెలుగు మీడియంలో చదివి, ఐఏఎస్ పరీక్షను తెలుగులోనే రాసి దేశంలో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ వంటి వారి విజయాలను ఉదాహరణలుగా పేర్కొన్నారు. మాతృభాష ప్రావీణ్యం వల్ల మేధోవికాసం, సృజనాత్మకత పెరుగుతాయని, గణితం–సైన్స్ విషయాలు కూడా సులభం అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. నర్సీపట్నం ప్రాంత వాసిగా గ్రామీణ పిల్లల చదువు గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ తెలుగు మీడియం విద్యను బలపరిచేలా “తెంగ్లీషు భాషోద్యమం” ప్రారంభించిన తీరును కూడా వివరించారు.ఇదే కార్యక్రమంలో ఆల్ ఇండియా జ్యోతిరావు పూలే ఓబీసీ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు తెలిపినట్లు, ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఢిల్లీలో ఉచిత కోచింగ్ ఇస్తున్నారు. సామాజిక చైతన్య కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐఐటీ, ఐఏఎస్, ఐపీఎస్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యలకు తక్కువ ఖర్చుతో అత్యుత్తమ అనుభవం కలిగిన అధ్యాపకుల ఆన్‌లైన్ బోధన కూడా నిర్వహిస్తున్నారు. దిగువ,మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మంచి నైపుణ్యం కలిగిన విద్యార్థులను దత్తత తీసుకొని, వారి ఉన్నత చదువులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు కార్యక్రమంలో సత్యనారాయణ, ప్రసాద్ నాయుడు పేర్కొన్నారు.అలాగే, అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల మండలాల్లో 8, 9, 10 తరగతుల గ్రామీణ పేద విద్యార్థులకు ఐఐటీ–జెఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్), నీట్ (యూజీ) పరీక్షల ఫౌండేషన్ కోచింగ్ ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ప్రముఖ ఆన్‌లైన్ విద్యా సంస్థ ఫిజిక్స్ వాలా, సమర్పణ సేవా సంస్థ, వేద విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం అమలవుతోంది. రిటైర్డ్ ఐపీఎస్ కిల్లాడి సత్యనారాయణ (సమర్పణ స్థాపకుడు), ఓబీసీ జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు (వేద విద్యా డైరెక్టర్) ఈ కార్యక్రమానికి ప్రధాన భాగస్వామ్యం వహిస్తున్నారు.గ్రామీణ ప్రతిభలను వెలికితీసి ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కోచింగ్‌ను ఊర్లోనే అందుబాటులో ఉంచుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి ఆర్థిక, సామాజిక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. వేసవి సెలవుల సమయంలో ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ సంస్థ సహకారంతో పూర్తి ఏర్పాట్లు చేశారు. ఐఐటీ–జెఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్), నీట్ (యూజీ) పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మార్చి 29 ఆదివారం మాకవరపాలెం మండలం, మరియు రోలుగుంట మండలాలలో ఈ కోచింగ్ కి సంబంధించిన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభమవుతాయన్నారు.

7
984 views

Comment