logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నంద్యాల మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా.

నంద్యాల (AIMA MEDIA): జిల్లా పరిధిలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా నంద్యాల మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్నతో పాటు సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై, పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. నగర అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను సమయానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

1
582 views

Comment