దివ్యాంగులకు నిరుపేదలకు చీరల పంపిణీ.
నంద్యాల (AIMA MEDIA): నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్ ఆరవ వార్డు నందు డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ (DRWA/AP) ఆధ్వర్యంలో రంజాన్ పండగ సందర్భంగా డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం దగ్గర నిరుపేద దివ్యాంగ కుటుంబాలకు మరియు నిరుపేద ముస్లిం మహిళలకు దాతల సహకారంతో దాదాపుగా వందమంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల బ్లడ్ బ్యాంకు ఎండి అచ్చు హాజరై నిరుపేదది ఆ కుటుంబాలకు నిరుపేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నంద్యాల బ్లడ్ బ్యాంకు ఎండి అచ్చు మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తమ వంతుగా చీరల పంపిణీ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించామని భవిష్యత్తులో కూడా దివ్యాంగుల కోసం సహాయ సహకారాలు అందిస్తామని ఇప్పటికే దివ్యాంగులకు ఉచితంగా బ్లడ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. డిజేబుల్డ్ రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వల్లి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా రంజాన్ మాసములో దాతల సహకారంతో నిరుపేద దివ్యాంగుల కుటుంబాలకు మరియు పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోపా, మరియు చీరలు అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, సభ్యులు మనన్,ఖాదర్ బాషా,ఇలియస్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.