కొత్తూరు సుబ్బరాయునిలో ఘనంగా గ్రామోత్సవం: ఆలయ ఈవో యం. రామక్రిష్ణ.
పాణ్యం (AIMA MEDIA): ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు ఉగాదిని పురస్కరించుకుని గురువారం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో యం. రామకృష్ణ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మిలిటరీ సుబ్బారెడ్డి, ప్రధాన అర్చకులు నారాయణస్వామి, సురేష్ శర్మలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో భాజా భజంత్రీలు, డప్పు వాయిద్యములు, బాణ సంచారంతో గ్రామ పురవీధుల గుండా అంగరంగ వైభవంగా గొప్ప ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, భక్తిశ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి "భక్త చింతామణి" పూర్తి నాటక ప్రదర్శన నిర్వహించారు.