తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ -మిశ్రమ బడ్జెట్: సిపిఐ MLC నెల్లికంటి సత్యం
హైదరాబాద్: AIMA MEDIA
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ పట్ల సిపిఐ MLC నెల్లికంటి సత్యం అసంతృప్తి వ్యక్తపరిచారు.ఈ సందర్భంగా MLC నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.ఈ బడ్జెట్ మిశ్రమ బడ్జెట్ అని, ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు ఏమి లేవని, ముఖ్యంగా పెన్షన్లు రెట్టింపు చేయలేదని, గీత కార్మికులు, యాదవులు, ముదిరాజులు, చేనేత కార్మికులు వంటి వృత్తి సంఘాలకు బడ్జెట్‌లో ప్రస్తావన లేదని పేర్కొన్నారు.విద్యకు 20% డిమాండ్ చేస్తుంటే 8% మాత్రమే కేటాయించారని, ఆరోగ్యానికి 4% మాత్రమే కేటాయించారని తెలిపారు.
కొత్తగా ఇందిరమ్మ బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారని పేర్కొన్నారు.నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో, నైపుణ్యాభివృద్ధిలో ఈ బడ్జెట్ దిశా నిర్దేశం చేయలేకపోయిందని ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల భర్తీపై స్పష్టత లోపించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.బడ్జెట్ కేవలం అసెంబ్లీ ప్రసంగాలకి పరిమితం కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడేలా ఉండాలని కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసేలా పారదర్శకమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ తరఫున కోరుతున్నాను అని ఈ సందర్భంగా తెలిపినారు.