logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కామారెడ్డిజిల్లా సదాశివనగర్ మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన- ప్రజల ఇంటింటికి కార్యక్రమంలో భాగంగాఉచిత ఆరోగ్యశిబిరం (హెల్త్ క్యాంప్)

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన ప్రజల ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా ఉచ్చిత ఆరోగ్య శిబిరం (హెల్త్ క్యాంప్ ) నిర్వహించబడింది ఈ ఆరోగ్య శిబిరంలో ఆరుగురు ప్రత్యేక వైద్యులు డాక్టర్ జి.కార్తీక్(సాధారణ ఆరోగ్య సమస్యలు),డాక్టర్ జే.విజ్ఞ(కంటిచూపు సమస్యలు), డాక్టర్ ఆర్.అనిల్ కుమార్ (దంత సమస్యలు), డాక్టర్ రియా లగ్దేవ్ (చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలు), డాక్టర్ బి.నాగార్జున(కీళ్ల,ఎముకల సమస్యలు) డాక్టర్ పి.సురేఖ(మహిళల ప్రత్యేక ఆరోగ్య సమస్యలు)ఈ శిబిరంలో అందించే సాధారణ ఆరోగ్య పరీక్షలు,బీపీ షుగర్ పరీక్షలు, కంటి పరీక్షలు,దంత పరీక్షలు,పిల్లల ఆరోగ్య పరీక్షలు,మహిళల ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది అని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు,విద్యార్థులు తమ ఆరోగ్య సమస్యలు తెలియచేసి వైద్య శిబిరంలో తగిన సూచనలు,మందులు తీసుకోవడం జరిగింది అని ఇట్టి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎంపిడిఓ సంతోష్ కుమార్,తహసిల్దార్, పి చ్ సి ఇంచార్జీ డాక్టర్ హరీష్,ఆయుర్వేద వైద్యురాలు నహిదా,సర్పంచ్ వంకాయల శిరీష రవి మరియు ప్రత్యేక అధికారులు, ఏ న్ ఎం లు,ఆశ వర్కర్ లు,మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొని వైద్య శిబిరాన్ని విజయవంతం చెయ్యడం జరిగింది.

18
1808 views

Comment