ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.. ప్రముఖుల హాజరు..
మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 20/03/2026:
మెట్‌పల్లి పట్టణంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని మక్కా మసీదులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఇఫ్తార్ విందులో పట్టణానికి చెందిన ప్రముఖులు, విలేకరులు పాల్గొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పట్టణంలో అన్ని మతాల ప్రజలు సోదరభావంతో కలిసి జీవిస్తున్నారని, ప్రతి పండగను అందరూ కలిసి జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు. మతాలకు అతీతంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు, కౌన్సిలర్లు ఖాజా అజీమ్, గుడికందుల అజయ్, నునుగొండ నరేష్, మాజీ కౌన్సిలర్ మహ్మద్ షాకీర్ సిద్ధిఖీ, మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి, మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి పాల్గొన్నారు.
అలాగే టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు చీటీ శ్రీనివాసరావు, మెట్‌పల్లి అధ్యక్షుడు డా. బూరం సంజీవ్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ అజీమ్, ఉపాధ్యక్షులు జంగం విజయ్, అఫ్రోజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాజిద్ పాషా, బాసెట్టి హరీష్, గౌరవ సలహాదారులు దాసం కిషన్, క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, పింజర్ శివ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్, యానం రాకేష్, రఫీ ఉల్లా, సోహెల్, హైమద్, ముత్యాల రమేష్, ఓంకారి శ్రీనివాస్, బొల్లం రాజు, మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్, సభ్యులు ఆదిల్ పాషా, రమణ, ఏసమేని గణేష్, ఎండి అభిద్, శశి కుమార్, అమ్ముల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.