logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రంజాన్ శుభాకాంక్షలు –.దారపునేని శ్రీనివాసరావు నాయుడు

పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు .దారపునేని శ్రీనివాసరావు నాయుడు గారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
"రంజాన్ అనేది కేవలం ఉపవాసాల పండుగ మాత్రమే కాదు… ఇది మనసును శుద్ధి చేసుకునే పవిత్ర కాలం. ప్రేమ, దయ, సహనం, సోదరభావం వంటి మానవ విలువలను పెంపొందించే ఆధ్యాత్మిక సమయం.
ముస్లిం సోదరులు ఈ పవిత్ర మాసంలో ఆచరించే ఉపవాసాలు క్రమశిక్షణకు, అంకితభావానికి ప్రతీకగా నిలుస్తాయి. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెరగాలని ఈ పండుగ మనకు గొప్ప సందేశం ఇస్తుంది.
మన రాష్ట్రంలో అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో, శాంతి సౌహార్దాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను.
అల్లాహ్ కృపతో అందరికీ ఆరోగ్యం, సుఖశాంతులు, అభివృద్ధి కలగాలని కోరుకుంటూ… మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను."
అని దారపునేని శ్రీనివాసరావు నాయుడు గారు తెలిపారు.

14
851 views

Comment