logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని ఈద్గా వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.

పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి 20 :-


పట్టణంలోని అన్ని మసీదులు ముఖ్యమైన ప్రదేశాలలో పికెట్స్ ఏర్పాటు.

ఈద్గా మైదానం వద్ద రేపు ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు

ఈద్గా మైదానాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ.

ఈరోజు రాత్రి నుండి కొనసాగనున్న బందోబస్తు ప్రక్రియ.

రేపు రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదిలాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని ఈద్గా మైదానం, మరియు మసీదులలో ముఖ్యమైన ప్రదేశాలలో పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలో దాదాపు 250 మంది సిబ్బందితో బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈరోజు రాత్రి నుండి పటిష్ట బందోబస్తు ప్రక్రియ మొదలవుతుందని, సిబ్బంది అందరూ అప్రమత్తమై ఉండాలని తెలిపారు. సిబ్బంది కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. రేపు ఉదయం ఈద్గా మైదానం వద్ద రంజాన్ ప్రార్థనలు ఉండనున్న కారణంగా ట్రాఫిక్ డైవర్షన్ ఉండనున్నట్లు, ప్రజలు పట్టణంలోని అంతర్గత రోడ్లను, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని తెలిపారు. ప్రత్యేకంగా పట్టణంలో పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, ప్రణయ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0
26 views

Comment