logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

9 గంజాయి మొక్కలు స్వాధీనం ముగ్గురి పై భీంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ఇద్దరు నిందితులు అరెస్ట్, ఒకరు పరారి

పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి 20 :-



13 గ్రాముల ఎండు గంజాయి, 9 గంజాయి మొక్కలు స్వాధీనం.

గంజాయి సేవిస్తూన్న వ్యక్తి, మరియు ఇద్దరు గంజాయి పండిస్తున్న వ్యక్తుల పై కేసు.

విక్రేతల నుంచి, కొనుగోలుదారుల వరకు అందరిపై చర్యలు

వివరాలను వెల్లడించిన జైనథ్ సిఐ జి శ్రావణ్

నిందితుల వివరాలు:
1) దైవాజ్ఞ రాజ్‌కుమార్ (36) s/o మురళీధర్, రాంనగర్, ఆదిలాబాద్. – కొనుగోలుదారు, వినియోగదారుడు (అరెస్ట్).
2) పుర్క నాగోరావ్ (48) s/o ధాంజి, r/o బేలసరి రాంపూర్, గంజాయి సాగు చేసి విక్రయించిన వ్యక్తి (అరెస్ట్).
3) సిడం శ్రీనివాస్ (44) s/o రామరావ్ r/o బేలసరి రాంపూర్ , – గంజాయి మొక్కలు పెంచిన వ్యక్తి (పరారీలో ఉన్నాడు).

జైనథ్ సర్కిల్ పరిధిలో మాదక ద్రవ్యాలపై, గంజాయి వినియోగం, విక్రయాలు మరియు సాగుపై పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సి.ఐ జి. శ్రావణ్ తెలిపారు.

గంజాయి పై విశ్వసనీయ సమాచారం మేరకు భీంపూర్ పోలీస్ సిబ్బంది బేలసరి రాంపూర్ గ్రామంలో తనిఖీలు నిర్వహించగా, ఈ సందర్భంగా కమ్యూనిటీ భవనం వద్ద నిందితుడు గంజాయి సేవిస్తున్న దైవాజ్ఞ రాజ్‌కుమార్‌ ను అదుపులోకి తీసుకోగా, అతని వద్ద 13 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. విచారణలో దైవాజ్ఞ రాజ్‌కుమార్ తెలిపినదేమనగా — తనకు గంజాయి తాగే అలవాటు కలిగి ఉండి, బేలసరి రాంపూర్ గ్రామానికి వచ్చి మరో నిందితుడు పుర్క నాగోరావ్ వద్ద నుంచి రూ.200కు గంజాయి కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. దీంతో వెంటనే పోలీసులు పుర్క నాగోరావ్ ఇంటిపై దాడి చేయగా, అతను తన పెరట్లో గంజాయి మొక్కలు పెంచుతూ, అవసరమున్న వారికి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అలాగే దైవాజ్ఞ రాజ్‌కుమార్‌కు కూడా గంజాయి అమ్మినట్లు తెలిపారు. అతని ఇంటి పెరట్లో ఉన్న 5 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా విచారణలో పుర్క నాగోరావ్ మరియు దైవాజ్ఞ రాజ్‌కుమార్ ఇద్దరూ కలిసి, అదే గ్రామానికి చెందిన సిడం శ్రీనివాస్ కూడా గంజాయి మొక్కలు పెంచుతూ, అప్పుడప్పుడు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. దీంతో బీంపూర్ పోలీసులు మరో నిందితుడు సిడం శ్రీనివాస్ ఇంటికి వెళ్లగా, అతను ఇంటి వద్ద లేకపోవడంతో, అతని తల్లి సిడం లక్ష్మీ సమాచారం ఇవ్వగా, వారి పెరట్లో 4 గంజాయి మొక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ నాలుగు మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తంగా 9 గంజాయి మొక్కలు మరియు 13 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని భీంపూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జైనథ్ సర్కిల్ సి.ఐ జి. శ్రావణ్ మాట్లాడుతూ — గంజాయి సాగు, విక్రయం, వినియోగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, గ్రామాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు. యువత, ప్రజలు మాదకద్రవ్యాలకు, గంజాయి కి దూరంగా ఉండాలని తెలిపారు.

ఈ కేసు నందు కొనుగోలు చేసినవారు, విక్రయించినవారు ఇరు వర్గాల వారిపై కూడా కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గంజాయి పండించిన వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీంపూర్ ఎస్సై విక్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0
12 views

Comment