logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ముస్లిం సోదరులకు మంత్రి జూపల్లి రంజాన్ శుభాకాంక్షలు



హైదరాబాద్, మార్చి 20:
పవిత్ర రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ పర్యాటక, సాంస్కృతిక, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు అత్యంత నిష్టతో, క్రమశిక్షణతో ఉపవాస దీక్షలు ముగించుకుని జరుపుకునే ఈ పండుగ సమాజంలో శాంతి, సౌభాతృత్వానికి ప్రతీక అని ఆయన కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు పంచిపెట్టాలనే 'జకాత్' విధి విధానం మానవత్వాన్ని చాటిచెబుతుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం భిన్నత్వంలో ఏకత్వానికి, గంగా-జమునా తెహజీబ్ సంస్కృతికి నిలయమని, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో కలిసిమెలసి పండుగలు జరుపుకోవడం మన రాష్ట్ర విశిష్టత అని ఆయన గుర్తుచేశారు.

అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, పరమత సహనం, స్నేహభావం మరింత పటిష్టం కావాలని కోరుకుంటూ అందరికీ 'ఈద్ ముబారక్' తెలియజేశారు.

0
0 views

Comment