logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సిద్ధిపేట జిల్లా, రూరల్ మండలంలోని కేసీఆర్ గారి స్వగ్రామం చింతమడకలో

ఈ నెల 25, 27న జరిగే శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి నూతన ధ్వజ స్తంభ ప్రతిష్ట మరియు శ్రీరామ నవమి వేడుకలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఆలయ కమిటీ ఆహ్వానించింది.

ఈ మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఆకుల రామ గౌడ్, పెండల గణేష్, బైరి నర్సింహా రెడ్డి, వాతం శివ, పడకండి విశ్వనాధం, ఎల్లప్పగారి పోచయ్య తదితరులు శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

0
58 views

Comment