అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని ఐటీడీపీ సభ్యులకు జనసమీకరణ బాధ్యతలు
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం నుంచి సోమవారం నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన జరగనుంది.ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రతి గ్రామం నుంచి జనసమీకరణ చేయాలని స్థానిక చోడవరం శాసనసభ్యులు కె.ఎస్.ఎన్.ఎస్. రాజు ఆదేశించారు. మండలంలోని అందరు ఐటీడీపీ సభ్యులకు ఈ బాధ్యతలు అప్పగించారు.రోలుగుంట గ్రామానికి బనికల సురేష్, కొవ్వూరు గ్రామానికి బంటు రాజు తదుపరి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఐటీడీపీ సభ్యులను ఇన్‌చార్జులుగా నియమించారు.తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు చోడవరం శాసనసభ్యులకు మరియు మండల తెలుగుదేశం నాయకులకు మండల ఐటీడీపీ ఇన్‌చార్జులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.