#అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ట్రయల్స్‌కు నాగజ్యోతి హర్యానా పయనం#
ఈనెల 22న హర్యానా రాష్ట్రం సోనిపట్ లో జరగనున్న జీపీసీ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ మరియు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు పి.వి.ఎం. నాగజ్యోతి గారు బయలుదేరుతున్నారు. ఈ ట్రయల్స్‌లో ఆమె ప్రతిభ కనబరిచి ఎంపికైతే, అక్టోబర్ నెలలో పోలాండ్‌లోనీ పనియానీస్ లో జరిగే ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించనుంది.
ఇప్పటికే పవర్ లిఫ్టింగ్ రంగంలో అనేక విజయాలు సాధించిన నాగజ్యోతి గారు క్రమశిక్షణ, పట్టుదల మరియు కఠోర సాధనతో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. క్రీడలతో పాటు విద్యా రంగంలోనూ సేవా తత్వంతో పనిచేస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు.
ఈ సందర్భంగా సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాభిమానులు మరియు స్థానిక ప్రజలు నాగజ్యోతి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, సెలక్షన్ ట్రయల్స్‌లో విజయాన్ని సాధించి ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొని భారతదేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.
“నాగజ్యోతి మరిన్ని విజయాలను అందుకొని దేశానికి గర్వకారణం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.”