విడవలూరులో దళిత సంఘం ఆందోళన – టిడిపి నేతపై కఠిన చర్యల డిమాండ్
నెల్లూరు జిల్లా విడవలూరు పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘం నేతలు ఆందోళనకు దిగారు. విడవలూరు మండలం ముధవర్తి గ్రామానికి చెందిన దళిత యువకుడు పట్టపు రోహిత్‌ను కులం పేరుతో దూషించి అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నేత రఫీపై వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు Yellu Salman Raju మాట్లాడుతూ, అట్రాసిటీ కేసులో బలమైన సెక్షన్లు నమోదు చేయకుండా పోలీసులు కేసును నీరుగార్చే విధంగా నామమాత్రపు సెక్షన్లు నమోదు చేశారని ఆరోపించారు.
టిడిపి నేత రఫీపై చట్టప్రకారం 306, BNS 108 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.