logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పిల్లలకు ఆటలు. పెద్దలకు రుచులు. ఆళ్లగడ్డ హైవేపై మిస్టర్ ఇడ్లీ. అద్భుత సౌకర్యాలు.

AIMA న్యూస్ బ్యూరో. నంద్యాల-కర్నూలు జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి మిస్టర్ ఇడ్లీ హోటల్ ఫేవరెట్ స్టాప్. సాధారణంగా హైవే హోటళ్లు అంటే కేవలం ఆకలి తీర్చుకోవడానికే అనుకుంటాం. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ, రుచికి రాయల్ ఆతిథ్యాన్ని జోడించి ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తోంది.మిస్టర్ ఇడ్లీ హోటల్ (Mr. Idli). నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని జమ్మలదిన్నె, పేరాయిపల్లె మెట్ట వద్ద ఈ హోటల్ ఇప్పుడు కేవలం ఒక భోజనశాల మాత్రమే కాదు, అద్భుతమైన వేడుకలకు వేదికగా మారింది. ఇక్కడి విశాలమైన స్థలం మరియు ఆహ్లాదకరమైన వాతావరణం మీ వేడుకకు ప్రత్యేక కళను తెస్తుంది. ముఖ్యంగా యువతను, టెక్నాలజీ ప్రియులను ఆకట్టుకునేలా బిగ్ స్క్రీన్ ప్రొజెక్టర్ (Projector) సౌకర్యం కల్పించారు. మీ మధుర జ్ఞాపకాలను, వీడియోలను ప్రొజెక్టర్‌పై ప్రదర్శిస్తూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పండుగలా జరుపుకోవచ్చు.
ఇక్కడి సాఫ్ట్ ఇడ్లీలు, కరకరలాడే దోశలతో పాటు ఘుమఘుమలాడే స్పెషల్ బిర్యానీ తింటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ప్రయాణంలో అలసిపోయిన వారు మర్చిపోయేలా చేసే టీ, కాఫీ ఇక్కడి ప్రత్యేకత.చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ప్లే పార్కు వారిని ఆనంద డోలికల్లో ముంచెత్తుతుంది. అత్యంత శుభ్రమైన మరియు సురక్షితమైన ప్రత్యేక టాయిలెట్ (Restrooms) సౌకర్యం ఇక్కడి మేనేజ్‌మెంట్ బాధ్యతకు నిదర్శనం. ఆళ్లగడ్డ - నంద్యాల రోడ్డులో వెళ్తున్నా లేదా ఏదైనా చిన్నపాటి వేడుక ప్లాన్ చేస్తున్నా, ఒక్కసారి మిస్టర్ ఇడ్లీని సందర్శించండి. ఆ మధుర రుచులను ఆస్వాదించండి.

175
5171 views

Comment