ఇందుకూరుపేటలో టీడీపీ మండల అధ్యక్షుడు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేటలో టీడీపీ మండల అధ్యక్షుడు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి 50వ జన్మదిన స్వర్ణోత్సవ వేడుకలను టీమ్ VPR ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు కోవూరు నియోజకవర్గంలోని పలు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు గుడి హరి రెడ్డి, టీడీపీ నాయకులు దాసరి విజయ్ కుమార్, కేతం రెడ్డి వినోద్ రెడ్డి, కోవూరు మండల మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి, కొడవలూరు మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, కోవూరు మండల అధ్యక్షుడు కొల్లాడి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలాగే పారిశ్రామిక వేత్త షేక్ హకీమ్, నెల్లూరు ప్రాంతానికి చెందిన నాయకులు, NDA కూటమి ప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీగా హాజరై ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు నాగార్జున నాయుడు మరియు ఇతర స్థానిక నాయకులు ప్రత్యేకంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.