ప్రజాసేవలో ముందంజలో డాక్టర్ అర్జున్ రెడ్డి – రంజాన్ సందర్భంగా తోఫా పంపిణీ
ప్రజాసేవలో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువనేత డాక్టర్ అర్జున్ రెడ్డి, తన తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల మధ్య సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
ఎమ్ఎల్ఏ వేమిరెడ్డి గారి తనయుడైన అర్జున్ రెడ్డి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ వివిధ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
పవిత్ర రంజాన్ సందర్భంగా, కొడవలూరు మసీదులో ఇమాములు మరియు మౌజన్‌లకు తోఫాలను అందజేశారు. ఈ కార్యక్రమం విపీఅర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మతసామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కూటమి నాయకులు, ముస్లిం మత పెద్దలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విపీఅర్ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.