logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చోడవరం ఎమ్మెల్యే చేతులతో 'పబ్లిక్ సత్తా' పత్రిక ఘన ఆవిష్కరణ

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు కే.ఎస్.ఎన్.ఎస్. రాజు చేతుల మీదుగా 'పబ్లిక్ సత్తా' దినపత్రిక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ప్రజల సమస్యలకు స్పందించే ఈ కొత్త పత్రిక జిల్లా పత్రికా రంగానికి మరో మైలురాయి అవుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు.పత్రిక ఎడిటర్ కొప్పు శ్రీను మాట్లాడుతూ, "ప్రజల సత్య సమాచారాన్ని వారి ముందుంచి, స్థానిక సమస్యలపై గళం విప్పి వారి సమస్యలను తీర్చాలనే లక్ష్యంతో ఈ పత్రికను ప్రారంభిస్తున్నాము. పాఠకుల మద్దతుతో మంచి పేరు సంపాదించుకొని ముందుండాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.అనంతరం ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్. రాజు మాట్లాడుతూ, "ప్రజల సమస్యలను ప్రభుత్వం ముందుంచి, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే ఈ పత్రికకు మా అభినందనలు. తెలుగుదేశం పార్టీ తెలుగు పత్రికా రంగాన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది" అని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు, నాలుగు మండలాల పత్రికా విలేకరులు పాల్గొన్నారు.

6
505 views

Comment