logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సాంబవరంలో ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్.

గోస్పాడు (AIMA MEDIA): నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో ఉగాది పండుగ మరియు అంకాలమ్మ తిరుణాల సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బల ప్రదర్శన పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పోటీలను ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ గ్రామీణ సంప్రదాయాలు మరియు సంస్కృతిని కాపాడుకోవడంలో ఇలాంటి క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రైతుల జీవితంలో అంతర్భాగమైన పశువుల శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే ఈ పోటీలు యువతకు స్ఫూర్తినిస్తాయని, గ్రామాల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సాంబవరం గ్రామ మాజీ సర్పంచ్ జూపల్లి రామ్ గోపాల్ రెడ్డి , జూపల్లి రామ భూపాల్ రెడ్డి , జూపల్లి వెంకటరమణారెడ్డి , జిల్లెల్ల హస్ముద్దీన్, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి , జిల్లెల్ల చంద్రశేఖర్ రెడ్డి, కాండ్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, హుస్సేన్సా ,గోస్పాడు మండలంలోని అన్ని గ్రామాల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

7
685 views

Comment