మేడారంలో భారీ రాళ్ల వర్షం, రైతుల ఆందోళన
జర్నలిస్ట్: ఆకుల గణేష్
ములుగు జిల్లా మేడారంలో గురువారం ఉదయం నుంచి భారీ రాళ్ల వర్షం కురుస్తోంది. కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలతో అల్లాడిన ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం ఉరుములతో కూడిన ఈ రాళ్ల వర్షం మిరప, పుచ్చ సాగు చేస్తున్న రైతులకు పంట నష్టంపై ఆందోళన కలిగిస్తోంది.