కాటారంలో క్షుద్ర పూజల కలకలం
జర్నలిస్ట్: ఆకుల గణేష్
కాటారం మండల కేంద్రం సమీపంలో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. గురువారం ఉదయం గ్రామస్థులు, రైతులు పొలం పనులకు వెళ్లే సమయంలో అయ్యప్ప గుడి దాటిన తర్వాత పోచమ్మ గుడికి వెళ్లే రోడ్డు పక్కన ఈ భయానక దృశ్యాలను చూసి నిర్ఘాంతపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు అమావాస్య అర్ధరాత్రి వేళ ఈ పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో వెదురుచాటలో రంగు రంగుల బట్టలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, నల్ల కోడి, ఈకలు, అన్నం ముద్దలు, గాజులు, వాటర్ బాటిల్, మరియు రక్తంతో కూడిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా, మూఢనమ్మకాలు ప్రజలను వెంటాడుతున్నాయని, క్షుద్ర పూజల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఈ ఘటన తెలియజేస్తోంది.