చారిత్రాత్మక నగరమైన వరంగల్‌లోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి ఆలయంలో, శ్రీ పరభవ నామ సంస్థార ఉగాది సందర్భంగా ఈరోజు వసంత నవరాత్రులు ప్ర
చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని *వసంత నవరాత్రులు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం నాలుగు గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన పిమ్మట అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించి అత్యంత సుందరంగా అలంకరణ జరిపారు.అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు చైర్మన్ మరియు ధర్మకర్తలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పసుపు రంగు చామంతికా పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ డాక్టర్ బి శివసుబ్రహ్మణ్యం ధర్మకర్తలు శ్రీ ఓరుగంటి పూర్ణచందర్, శ్రీమతి మయూరి రామేశ్వరరావు, శ్రీ బింగి సతీష్, పాలడుగుల ఆంజనేయులు, శ్రీ శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. సాయంకాలం ఏడు గంటలకు దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి శ్రీ అయినవోలు రాధాకృష్ణ శర్మ గారిచే పంచాంగ శ్రవణం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అనేకమంది భక్తులు పాల్గొన్నారు.రామల సునీత కార్యనిర్వహణాధికారి