యువతకు 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం – ఎమ్మెల్యే vemireddu ప్రశాంతి రెడ్డి
యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేసిందని, అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 6 లక్షలు 28 వేల 347 ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ కేవలం ప్రకటన కాదని, నిరుద్యోగులకు భరోసా కల్పించే సాధనమని తెలిపారు.
రాష్ట్రానికి ₹23 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, దాంతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. మెగా డీఎస్సీతో పాటు మరోసారి డీఎస్సీ ద్వారా 3 వేల జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గ్రూప్-1, గ్రూప్-2లో సుమారు 600 పోస్టులు, 1000 పోలీస్ కానిస్టేబుల్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు.
కోవూరు నియోజకవర్గంలో CMRF ద్వారా అనారోగ్య బాధితులకు ₹8 కోట్లు ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, మత్స్యకార భరోసా, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రజలకు మేలు చేశాయని కొనియాడారు.
సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో అమలు చేయగల సామర్థ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే ఉందని ప్రశాంతి రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కోవూరు ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.