logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మైగవ్ క్విజ్‌లో మూడు లక్షల పాయింట్లతో చేంజ్ మేకర్.. వృక్షమిత్ర రాంబాబు ప్రతిభా వికాసం

అనకాపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే మైగవ్ క్విజ్ ప్రోగ్రామ్‌లో వృక్షమిత్ర సమితి వ్యవస్థాపకులు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు అప్పన రాంబాబు అసాధారణ ప్రతిభ కనబరిచారు. గత మూడు సంవత్సరాల్లో సుమారు 150 క్విజ్‌లలో పాల్గొని మూడు లక్షల పాయింట్లు సాధించి చేంజ్ మేకర్ హోదా పొందారు.ఆజాద్ కా ఆమృత్ మహోత్సవం, పర్యావరణ పరిరక్షణ, స్వాతంత్ర్య సమరం, గణతంత్ర దినోత్సవం, మహిళా శక్తి, బాలికా ప్రగతి, వందేమాతరం, స్వచ్ఛభారత్, వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర, యోగా దినోత్సవం వంటి క్విజ్‌ల్లో ఆయన పాల్గొన్నారు.రాంబాబు మాట్లాడుతూ, నిరంతర విద్యార్థిగా ఉంటే విద్యా వికాసంలో మెరుగైన ఫలితాలు సాధ్యమని అన్నారు. ఆయన విజయాన్ని పలువురు అభినందించారు.

5
25 views

Comment