logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సాయిబాబా మందిరం ప్రాంగణంలో చలివేంద్రం ఏర్పాటు

భద్రాచలం(19.03.2026):

జూనియర్ కళాశాల సెంటర్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో వేసవికాలం దృష్ట్యా ఆలయం ముందు చలివేంద్రాన్ని ఆలయ చైర్మన్ కొమ్మనాపల్లి ఆదినారాయణ ప్రారంభించారు.
ప్రతి సంవత్సరం వేసవిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే చలివేంద్రాన్ని శ్రీ సాయిబాబా ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తున్నదని అన్నారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బాబా ఆలయం పూలతో అలంకరణ భక్తులకు తీర్థ ప్రసాదాలు భోజనం ఏర్పాటు చేశామని తెలిపారు .
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వన్ మాగంటి శ్రీనివాస వరప్రసాద్,ప్రధాన కార్యదర్శి అబ్బినేని శ్రీనివాసరావు మరియు చారుగుళ్ల సుబ్రహ్మణ్యం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

64
8171 views

Comment