logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

దివ్యాంగులకు ఉగాది, రంజాన్ పండుగ సరుకుల కిట్ల పంపిణీ.

నంద్యాల (AIMA MEDIA): ఉగాది, రంజాన్ పండుగలు పురస్కరించుకుని బుధవారం నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో, నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఐఎంఏ నంద్యాల కార్యదర్శి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ మహమ్మద్ రఫీ ల సౌజన్యంతో 30 మంది పేద దివ్యాంగులకు పండుగ సరుకుల కిట్లను ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి తో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ మహమ్మద్ రఫీ లు మాట్లాడుతూ ఐఎంఏ నంద్యాల తరపున దివ్యాంగులకు నిరంతరం సహకారం అందజేస్తున్నామని, హిందూ ముస్లింలకు ప్రధాన పండుగలైన ఉగాది, రంజాన్ పురస్కరించుకుని పేద దివ్యాంగులకు పండుగ సరుకులు అందజేయడం జరిగిందని అన్నారు. దివ్యాంగులు పండుగ బాగా చేసుకునేందుకు తోడ్పడే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశామన్నారు.దివ్యాంగులకు నంద్యాల వైద్యుల సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామన్నారు.ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి.రమణయ్య, ప్రధాన కార్యదర్శి రామలింగం, లయన్స్ క్లబ్ సభ్యుడు రామయ్య, కళారాధన కార్యవర్గ సభ్యుడు శివరామిరెడ్డి, దివ్యాంగులు పాల్గొన్నారు.

0
762 views

Comment