logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పైపులైన్ లీక్‌కు తక్షణ మరమ్మత్తులు రేపటి నుంచి సాధారణంగా నీటి సరఫరా

విజయనగరం జిల్లా. రాజాం.

రాజాం మున్సిపాలిటీ పరిధిలోని కొండంపేట గ్రామానికి వెళ్లే రహదారిపై చీపురుపల్లి సీపీడబ్ల్యూఎస్ పథకానికి చెందిన త్రాగునీటి పైపులైన్ వద్ద లీక్ ఏర్పడింది. 450 ఎంఎం పైపులైన్‌కు అమర్చిన 100 ఎంఎం ఎయిర్ వాల్వ్ మంగళవారం లీక్ అవుతుండడంతో స్థానికులు సమస్యను గుర్తించారు.
ఈ విషయాన్ని రాజాం విశాలాంధ్ర దినపత్రిక ప్రతినిధి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, స్పందించిన అధికారులు బుధవారం ఉదయం సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మత్తు పనులు ప్రారంభించారు. తక్షణ చర్యలతో లీకేజీని పూర్తిగా అరికట్టారు.
ఈ మరమ్మత్తుల కారణంగా చీపురుపల్లి, మెరకముడుదాం ప్రాంతాలకు నీటి పంపింగ్‌లో ఆలస్యం జరిగినట్లు ఆర్డబ్ల్యూఎస్ జేఈ యుగంధర్ తెలిపారు. గురువారం నుంచి యథావిధిగా త్రాగునీటి సరఫరా పునరుద్ధరించబడుతుందని ఆయన వెల్లడించారు.

0
148 views

Comment