రంజాన్ మాసం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రముఖ హిందూ సోదరులు
ఆళ్లగడ్డ మండలంలోని మర్కజ్ మసీదులో బుధవారం ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అమీర్ భాషా ఆధ్వర్యంలో ప్రముఖ హిందూ సోదరులను ఆహ్వానించి రంజాన్ ఉపవాస ఇఫ్తార్ విందులో సాలువలతో సన్మానించారు. ముస్లిం సోదరులు 30 రోజుల కటోర నియమా నిష్టతో, భక్తి శ్రద్ధలతో, రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రంజాన్ మాసం ముస్లిం సోదరులకు అత్యంత విశిష్ట కలిగిన మాసం అల్లా వారికి ఇచ్చిన గొప్ప వరం దానధర్మాలకు నమాజులకు విశిష్టమైనదని సీ ఐ యుగంధర్ తెలిపారు సమాజం నందు సమానత్వం ఐకమత్యం ఉండాలని ఆరాధించే మార్గాలు వేరైనా భగవంతుడు ఒక్కడే అని మత గురువు మొహమ్మద్ జాఫర్ సాదిక్ అన్నారు. కార్యక్రమంలో టిఎంసి వేణుగోపాల్ , డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి, త్రినేత్ర చిట్ఫండ్ మోహన్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు