logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నార్నూర్ లో గిరిజన మ్యూజియం ప్రారంభం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా*

పత్రికా ప్రకటన
మార్చి 18, 2026_ఆదిలాబాద్:

*

నార్నూర్ గిరిజన మ్యూజియాన్ని సందర్శించి గిరిజన వారసత్వాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం నార్నూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియంను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఐటిడిఎ పిఓ యువరాజ్ మర్మాట్ తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నీతి అయోగ్ నుండి అందిన డెల్టా ర్యాంకింగ్ గ్రాంట్ ద్వారా సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో గిరిజన మ్యూజియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దడం జరిగిందని, ఈ మ్యూజియంలో భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజన తెగల సంస్కృతిని ప్రతిబింబించే బొమ్మలు, పెయింటింగ్స్, ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల అరుదైన కళాఖండాలను ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు. సందర్శకులకు గిరిజన సంస్కృతిపై అవగాహన కల్పించేందుకు ప్రతి వస్తువు వద్ద సమాచార బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మ్యూజియం నిర్వహణ బాధ్యతలను స్థానిక మహిళా సంఘాలకు అప్పగించామని, ప్రవేశ రుసుముగా కేవలం 5 రూపాయలు మాత్రమే నిర్ణయించినట్లు వెల్లడించారు. సమీపంలోని లైబ్రరీ, ఎంఆర్ఓ, ఎంపిడిఓ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ మ్యూజియాన్ని సందర్శించి గిరిజన వారసత్వాన్ని తెలుసుకోవాలని ఆయన కోరారు.

అనంతరం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 9-14 సంవత్సరాల వయసుల బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఐటిడిఎ పీఓ, కలెక్టర్ లు కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీందర్, డిఏంహెచ్ఓ నరేందర్ రాథోడ్, తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో గంగా సింగ్, నీతి అయోగ్ ప్రోగ్రామ్ అధికారి రాహుల్, ఈఈ తనాజీ, సర్పంచ్ కావేరి,వైద్యులు, వైద్య శాఖ సిబ్బంది, ఇతర అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, తదితరులు.

0
81 views

Comment